logo

అటవీ సిబ్బందిపై గ్రామస్థుల దాడి

మయూర్‌భంజ్‌ జిల్లా ఠాకూర్‌ముండా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎద్దులవేడ గ్రామస్థులు సోమవారం రాత్రి అటవీ అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు.

Updated : 30 Nov 2022 04:24 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాచరణ్‌

కటక్‌ న్యూస్‌టుడే: మయూర్‌భంజ్‌ జిల్లా ఠాకూర్‌ముండా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎద్దులవేడ గ్రామస్థులు సోమవారం రాత్రి అటవీ అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజర్‌ దుర్గా చరణ్‌తోపాటు ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ఎద్దులవేడ గ్రామానికి చెందిన వేటగాళ్లు అడవిలో జంతువులను వేటాడి ఇళ్లల్లో ఉంచినట్లు సమాచారం అందడంతో ఠాకూర్‌ముండా ఫారెస్ట్‌ రేంజర్‌ దుర్గాచరణ్‌, సిబ్బంది గ్రామంలో తనిఖీలు చేసేందుకు సోమవారం రాత్రి బయలుదేరారు. వారు వస్తున్నట్లు ముందుగా తెలుసుకున్న గ్రామస్థులు గ్రామానికి వచ్చే మార్గంలో కాపలా కాశారు. అటవీ అధికారుల వాహనాలను అడ్డుకొని వారిపై దాడి చేశారు. కొంతమంది సిబ్బంది తప్పించుకొని అడవిలోకి వెళ్లిపోగా రేంజర్‌తోపాటు మరో ముగ్గురు సిబ్బందిపై గ్రామస్థులు తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అధికారిని, సిబ్బందిని ఆదుకొని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొంతమంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని