రాష్ట్రంలో సంపద, సౌకర్యాలు పుష్కలం
రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం, సుస్థిర పాలన, అపారమైన సంపద, సౌకర్యాలు ఉన్నాయని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
శాంతికి ప్రతీక ఒడిశా... పెట్టుబడులు పెట్టండి
మేకిన్ ఒడిశా సదస్సులో సీఎం నవీన్
ప్రముఖుల హర్షం
కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మిత్తల్, కుమార మంగళం బిర్లా, అనిల్ అగ్రవాల్, సజ్జన్ జిందాల్, టి.వి.నరేంద్రన్, నవీన్ జిందాల్ మాట్లాడారు. ఒడిశాలో పరిశ్రమల ఏర్పాటుకు సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు.
* జేఎస్‌డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ పరదీప్‌లో రూ.లక్ష కోట్ల వ్యయంతో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామన్నారు.
* లక్ష్మీనారాయణ మిత్తల్ మాట్లాడుతూ కేంద్రపడలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి గతంలో ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలో పనులు ప్రారంభిస్తున్నామని వివరించారు.
* అనిల్ అగ్రవాల్ మాట్లాడుతూ వేదాంత గ్రూపు నిర్మాణాలను విస్తరిస్తామన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న మిత్తల్
భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం, సుస్థిర పాలన, అపారమైన సంపద, సౌకర్యాలు ఉన్నాయని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఏర్పాటైన 5 రోజుల మేకిన్ ఒడిశా-2022 సదస్సులో రెండోరోజు గురువారం ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఖనిజ సంపదల వినియోగం, పరిశ్రమల ఏర్పాటు ధ్యేయంగా నూతన పారిశ్రామిక విధానం అమలు చేసి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు నిలయమైన ఒడిశా ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో ముందంజ వేసిందన్నారు. విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ, ఓడరేవులు తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. సమావేశం ప్రారంభంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్ మాట్లాడుతూ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి కల్పించిన సౌకర్యాల గురించి విపులంగా వివరించారు.
సీఎంకు ప్రముఖుల అభివాదం
ముఖాముఖి చర్చలు
జర్మనీ, జపాన్, నార్వే రాయబారులతో నవీన్
మేకిన్ ఒడిశా సదస్సులో గురువారం 2 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నవీన్ జపాన్, నార్వే, జర్మనీ దేశాల రాయబారులు, ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఫిక్కీ ప్రతినిధులతో ముఖాముఖి చర్చించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరినట్లు పరిశ్రమలు, విద్యుత్తు, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్‌దేవ్ విలేకరులకు తెలిపారు.
భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు
భువనేశ్వర్, న్యూస్‌టుడే: మేకిన్ ఒడిశా ఆరంభం అదిరింది. భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరినట్లు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంతశర్మ గురువారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. 67 కంపెనీలతో జరిగిన ఎంఓయూల మేరకు రూ.5,25,742.26 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, 2,47,892 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. గడిచిన 6 నెలల కాలంలో దుబాయ్, ముంబయి, దిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటైన సదస్సులో 78 ఎంఓయూలు కుదిరాయని, రూ.1,40,386.19 కోట్ల పెట్టుబడులొస్తాయని వివరించారు. 72,869 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. మొత్తం పెట్టుబడులు రూ.7,26,128.45 కోట్లు, ఒప్పందాలు 145గా ఉందని శర్మ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్