logo

కోణార్క్‌-2022 నృత్యోత్సవాలు ప్రారంభం

పూరీ జిల్లా కోణార్క్‌ శిల్పకళారామం ఆవరణలో గురువారం రాత్రి కోణార్క్‌-2022 అయిదు రోజుల నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Published : 02 Dec 2022 03:30 IST

ఉత్సవాల్లో అలరించిన శాస్త్రీయ నృత్యాలు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ జిల్లా కోణార్క్‌ శిల్పకళారామం ఆవరణలో గురువారం రాత్రి కోణార్క్‌-2022 అయిదు రోజుల నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్వినిపాత్ర్‌ ఈ వేడుకలకు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టరు సమర్థవర్మ, ఎస్పీ కె.విశాల్‌సింగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రారంభమైన శాస్త్రీయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకున్న పర్యటక శాఖ పూరీ, భువనేశ్వర్‌ నుంచి కోణార్క్‌కు రాకపోకలు చేయడానికి లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని