logo

13 అడుగుల ఎత్తయిన ‘అశోక స్తంభం’

ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపురకు చెందిన యువ కళాకారుడు రాజ్‌కుమార్‌ బెహర 13 అడుగుల ఎత్తయిన అశోక స్తంభాన్ని రూపొందించాడు.

Published : 02 Dec 2022 03:30 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపురకు చెందిన యువ కళాకారుడు రాజ్‌కుమార్‌ బెహర 13 అడుగుల ఎత్తయిన అశోక స్తంభాన్ని రూపొందించాడు. దీన్ని గొళాబంధలోని ఆర్మీ ఏడీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తారని ఆయన గురువారం సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. 13 అడుగుల ఎత్తు, 6.10 అడుగుల వెడల్పున గ్లాస్‌ ఫైబర్‌ సీసీ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశానని, ఇందుకు నలభై రోజులు పట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో అశోక చక్రం, ఏనుగు, అశ్వం, సింహం, ఆంబోతు తదితర రూపాలున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని