logo

ఓటు హక్కు వినియోగంలో యువత ముందుండాలి

ఓటు హక్కు వినియోగంలో యువత ముందుండాలని సబ్‌-కలెక్టర్‌ భీమ్‌సేన్‌ సబరో అన్నారు.

Updated : 02 Dec 2022 06:36 IST

మాట్లాడుతున్న భీమ్‌సేన్‌, వేదికపై లక్ష్మీనారాయణ తదితరులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే:  ఓటు హక్కు వినియోగంలో యువత ముందుండాలని సబ్‌-కలెక్టర్‌ భీమ్‌సేన్‌ సబరో అన్నారు. కోమట్లపేటలోని ఉగ్రతార ఉన్నత సెకండరీ పాఠశాలలో గురువారం జరిగిన ఓటరు నమోదు ప్రక్రియ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని సద్వినియోగపరుచుకునేందుకు యువత చొరవ చూపాలని సబరో హితువు పలికారు. ఈ ఏడాది 17 ఏళ్లు నిండిన వారంతా వచ్చే ఏడాది కోసం ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. 18 ఏళ్ల వారు 23 మందితో పాటు 17 ఏళ్ల వారు మరో 15 మంది ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పాఠశాల ప్రిన్సిపాల్‌, ప్రభాకర్‌దాస్‌ తెలిపారు. కార్యక్రమంలో రాయగడ బీడీవో లక్ష్మీనారాయణ సబతో, శంకర్‌పండా, నీలాంచల్‌ మిశ్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని