logo

ప్రజల్లోకి రాని సీఎం వారి వేదన ఎలా వింటారు?

తాను పదేళ్ల క్రితం బరగఢ్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో పద్మపూర్‌ ఎలా ఉందో? ఇప్పుడు అలాగే ఉందని, ఏ మార్పు, అభివృద్ధి లేదని భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి అన్నారు.

Published : 03 Dec 2022 00:54 IST

భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి

అపరాజిత షడంగి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: తాను పదేళ్ల క్రితం బరగఢ్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో పద్మపూర్‌ ఎలా ఉందో? ఇప్పుడు అలాగే ఉందని, ఏ మార్పు, అభివృద్ధి లేదని భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి అన్నారు. శుక్రవారం పద్మపూర్‌లో ఉప ఎన్నిక ప్రచారం చేసిన ఆమె విలేకరులతో మాట్లాడారు. 23 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సీఎంగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. భువనేశ్వర్‌లో ఏర్పాటయ్యే కీలక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని, ఇటీవల ఏర్పాటైన పంచాయతీ ప్రజాప్రతినిధుల రెండు రోజుల సమావేశాల్లోనూ ఆయన దర్శనం కరవైందని పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం 147 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాల్సిన సీఎం నవీన్‌ ఇంటికే పరిమితమయ్యారన్నారు. బిజద అభ్యర్థి బర్షారాణి సత్యబాది కోడలని, ఆమె పద్మపూర్‌ ప్రజలకు ఏం చేయగలరని ప్రశ్నించారు. తాను ఒడిశా కోడలినైన తరువాత కన్నవారింటికి వెళ్లడం మానేశానని, మెట్టినింటికి, ప్రజలకు సేవ చేయడానికే పరిమితమయ్యానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు