logo

అలరిస్తున్న నృత్యాలు.. సైకత కళారూపాలు

కోణార్క్‌-2022 నృత్యోత్సవాలు సందర్శకులను సమ్మోహితులను చేస్తున్నాయి. మరోవైపు చంద్రభాగ తీరంలో ఏర్పాటైన అంతర్జాతీయ సైకత శిల్పకళా ప్రదర్శన పోటీలు ఆకట్టుకుంటున్నాయి.

Published : 03 Dec 2022 00:54 IST

ప్రపంచానికి శాంతి సందేశమిస్తూ.. చంద్ర భాగ తీరంలో సైకత శిల్పం

గోపాలపూర్‌ న్యూస్‌టుడే: కోణార్క్‌-2022 నృత్యోత్సవాలు సందర్శకులను సమ్మోహితులను చేస్తున్నాయి. మరోవైపు చంద్రభాగ తీరంలో ఏర్పాటైన అంతర్జాతీయ సైకత శిల్పకళా ప్రదర్శన పోటీలు ఆకట్టుకుంటున్నాయి. గురువారం రాత్రి ఈ అయిదు రోజుల వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్వినీ పాత్ర్‌ మాట్లాడుతూ కోణార్క్‌ వైభవం గొప్పదని, విదేశీ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ శిల్పారామాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి ఏటా ప్రభుత్వం శాస్త్రీయ నృత్యోత్సవాలు, సైకత శిల్పాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంఫాల్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అకాడమీకి చెందిన మణిపురి నృత్యాలు, కటక్‌, గంజాం డ్యాన్స్‌ అకాడమీ కళాకారుల ఒడిస్సీ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

విద్యుత్తు కాంతుల్లో కోణార్క్‌ ధగధగ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని