logo

దమన్‌ చిత్రం ప్రత్యేక ప్రదర్శన

మల్కాన్‌గిరి జిల్లాలో విజృంభించిన మలేరియా నివారణకు యంత్రాంగం దమన్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో పరిస్థితులను ఇతి వృత్తంగా తీసుకుని నిర్మించిన చిత్రం ‘దమన్‌’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Published : 03 Dec 2022 00:54 IST

చిత్రం చూస్తున్న కలెక్టర్‌ విశాల్‌ ఇతర అధికారులు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లాలో విజృంభించిన మలేరియా నివారణకు యంత్రాంగం దమన్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో పరిస్థితులను ఇతి వృత్తంగా తీసుకుని నిర్మించిన చిత్రం ‘దమన్‌’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రాన్ని గురువారం రాత్రి మల్కాన్‌గిరి కలెక్టర్‌ విశాల్‌ సింగ్‌తోపాటు ఇతర అధికారులు థియేటర్‌లో వీక్షించారు. చిత్రకొండ ప్రాంతంలోని స్వాభిమాన్‌ ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ చిత్రాన్ని చూపించేందుకు ప్రత్యేక బస్సులు వేసి తీసుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని