logo

నత్తనడకన బిజు సేతు నిర్మాణాలు

రాష్ట్రంలో బిజు సేతు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో పనులు జరగనందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’ (కాగ్‌) ప్రభుత్వంపై అక్షింతలేసింది.

Published : 04 Dec 2022 02:19 IST

ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు

బిజు సేతు పథకంలో నిర్మాణం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బిజు సేతు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో పనులు జరగనందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’ (కాగ్‌) ప్రభుత్వంపై అక్షింతలేసింది. శుక్రవారం రాత్రి శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడానికి ముందు ‘కాగ్‌’ నివేదిక సభలో ప్రవేశపెట్టారు.

నాలుగేళ్లలో 473 నిర్మాణాలు

2020-21 సంవత్సరానికి సంబంధించి కాగ్‌ అధ్యయన నివేదికలో బిజుసేతు నిర్మాణాల వైఫల్యాలను ప్రస్తావించింది. అందులోని వివరాల ప్రకారం... నాలుగేళ్లలో 793 ఆనకట్టల పనులు పూర్తి చేయాలన్న ధ్యేయం నెరవేరలేదు. 473 నిర్మాణాలు మాత్రమే చేపట్టారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఇందుకోసం 2017-2021 సంవత్సరాల బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,570 కోట్లు కేటాయించింది. 88 శాతం నిధులు (రూ.2252.62 కోట్లు) ఖర్చయ్యాయి. ఇంతవరకు రూ.314.38 కోట్లు ఖర్చవలేదు. నిర్మాణాల్లో చాలాచోట్ల నాణ్యత కరవైంది. గుత్తేదారులు (కాంట్రాక్టర్లు) నాసిరకం పనులు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మూడు డివిజన్ల ఇంజినీర్లు పనులు పర్యవేక్షించాల్సి ఉన్నా వారు కూడా పట్టించుకోలేదు. అసంపూర్తి పనులపై గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం దృష్టి సారించలేదు. సకాలంలో పనులు చేయలేకపోయిన గుత్తేదారులపై చర్యలు లేవు. బిజుసేతు పథకం పనులకు నిధులు కేటాయించిన ప్రభుత్వం తర్వాత వాటిని విస్మరించిందని ‘కాగ్‌’ తన నివేదికలో ఎండగట్టింది. దీనిపై కాంగ్రెస్‌ సభాపక్షం (సీఎల్పీ) నేత నర్సింగ మిశ్ర భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... నిధులు దుర్వినియోగం బిజుసేతు పథకానికి మాత్రమే పరిమితం కాలేదని, మిగతా పథకాలు అలాగే ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని