logo

రైతులు, మహిళల పట్ల వివక్ష

నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రైతులు, మహిళల పట్ల వివక్ష చూపుతోందని, విలువలకు సమాధి కట్టిందని భాజపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 04 Dec 2022 02:19 IST

నవీన్‌ ప్రభుత్వంపై భాజపా నేతల ధ్వజం

ఆందోళనలో పాల్గొన్న లేఖశ్రీ, ఇతర మహిళలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రైతులు, మహిళల పట్ల వివక్ష చూపుతోందని, విలువలకు సమాధి కట్టిందని భాజపా నేతలు ధ్వజమెత్తారు. శనివారం పార్టీ నేతలు భువనేశ్వర్‌ పీఎంజీ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఇతర మంత్రుల దిష్టిబొమ్మలు తగలబెట్టారు. ఆందోళనలో మహిళా మోర్చా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర శాఖ కార్యదర్శి లేఖశ్రీ సామంత శింగార్‌ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని, అత్యాచార ఘటనలు పెరిగినా చర్యలు కరవయ్యాయన్నారు. భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి మాట్లాడుతూ.. అన్నదాతల ఇబ్బందులపై అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు ప్రస్తావించినా సమాధానం చెప్పలేని పాలకులు సభా కార్యక్రమాలను నిరవధికంగా వాయిదా వేసి విలువలు, గణతంత్ర వ్యవస్థకు తూట్లు పొడిచారన్నారు. దీనిపై భాజపా ఆదివారం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యమిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని