logo

రాష్ట్ర రెజ్లింగ్‌ పోటీల్లో గంజాంకు తొమ్మిది పతకాలు

పూరీలోని పంచముఖి జిమ్నాజియమ్‌లో ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో గంజాం జిల్లా బాలబాలికలు సత్తాచాటి పతకాలు సాధించారు.

Published : 04 Dec 2022 02:19 IST

పతకాలతో విజేత బాలబాలికలు: చిత్రంలో కోచ్‌ బాలకృష్ణరెడ్డి, ఇతర క్రీడాకారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: పూరీలోని పంచముఖి జిమ్నాజియమ్‌లో ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో గంజాం జిల్లా బాలబాలికలు సత్తాచాటి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కోచ్‌ బాలకృష్ణరెడ్డి శనివారం మధ్యాహ్నం ‘న్యూస్‌టుడే’తో ఫోన్లో మాట్లాడుతూ వివిధ శరీరబరువు కేటగిరీలలో చేపట్టిన సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌, అండర్‌-15 విభాగాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ఒక స్వర్ణం, ఎనిమిది రజత పతకాలు కైవశం చేసుకున్నారని ఆయన చెప్పారు. పతకాలు అందుకున్న వారిలో జి.బిద్యాశ్రీ రెడ్డి (స్వర్ణం), సుమిత్ర మఝి, పి.ఖుషి, మీరా రొణా, గీతాంజలి మండల్‌, సుగ్యాణి ప్రధాన్‌, బిజయశ్రీ ప్రధాన్‌, సుభం పాత్ర్‌, కె.సంజీవ్‌కుమార్‌ (రజత పతకాలు)లున్నారు. పతకాల విజేతలకు స్థానిక క్రీడాసంస్థల నిర్వాహకులు అభినందనలు తెలిపారు.  

ఉత్సాహంగా జిల్లాస్థాయి బాలల క్రీడలు

గంజాం జిల్లా శిశు సురక్ష్యా కార్యాలయం (డీసీపీఓ) ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి బాలబాలికల క్రీడాపోటీలు నిర్వహించారు. స్థానిక కళ్లికోట విశ్వవిద్యాలయం మైదానంలో ఉత్సాహ్‌-2022 పేరిట ఏర్పాటైన పోటీలను బ్రహ్మపుర విశ్వవిద్యాలయం విశ్రాంత ఫ్రొఫెసర్‌ అమియ కుమార్‌ పరిచ్ఛ, కమర్షియల్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ ఆఫీసరు నిరంజన్‌ బెహరా అతిథులుగా హాజరై ప్రారంభించారు. 100, 200 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, ఫుట్‌బాల్‌ మ్యాచులు, ఇండోర్‌ హాల్లో చదరంగం, క్యారమ్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డీసీపీఓ శరత్‌ చంద్రమహరణా, జువెనల్‌ హోం సూపరింటెండెంట్‌ సుధాం పాణిగ్రహి, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుడు హరిహర పాఢి తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు సాయంత్రం స్థానిక ఉత్కళబాలాశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని