logo

ప్రకృతి అందాల ఎకో రిట్రీట్‌

రాష్ట్రంలో పర్యటకపరంగా కొరాపుట్‌ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పర్యటక కేంద్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విదేశీ పర్యటకులు సైతం జిల్లాకు అధికంగా వస్తున్నారు.

Published : 06 Dec 2022 03:24 IST

ఎకో రిట్రీట్‌ కేంద్రం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పర్యటకపరంగా కొరాపుట్‌ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పర్యటక కేంద్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విదేశీ పర్యటకులు సైతం జిల్లాకు అధికంగా వస్తున్నారు. దీంతో వారిని మరింత ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యటకశాఖ ఎకో రిట్రీట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ సమీపంలో గతేడాది ఎకో రిట్రీట్‌ కేంద్రాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయగా మంచి ఆదరణ లభించగా, మళ్లీ ఈ ఏడాది కూడా ఎకో రిట్రీట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో రాజస్థాన్‌కు చెందిన సంస్థ నిర్వహణ బాధ్యత చేపట్టగా కొన్ని తప్పులు జరిగిన నేపథ్యంలో ఈసారి దిల్లీకి చెందిన సంస్థకు జిల్లా యంత్రాంగం నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఈ నెల 1న ఈ కేంద్రాన్ని సీఎం నవీన్‌ పట్నాయక్‌ వీసీ ద్వారా ప్రారంభించారు. అనంతరం పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్‌ పాఢి ప్రజలకు అంకితం చేశారు. కేవలం శీతాకాలంలోనే ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో విడిది చేయాలంటే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవలసి ఉంటుంది. రాత్రి బస చేసేందుకు టెంట్‌లు, ప్రత్యేక ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడలు, ఆదివాసీ నృత్యాలు, పర్వతారోహణ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 5 ప్రీమియం, 20 డీలక్స్‌ కాటేజ్‌లు, ఒక రెస్టారెంట్‌, 24 గంటల పోలీస్‌, వైద్య సేవలు ఉంటాయి. పుట్‌సీల్‌, ఫుల్‌బందొ గ్రామాల మధ్య గిర్లీ మాలి పర్వతంపై ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి సిమిలిగుడ మీదుగా వయా దుదారివైపు 25 కి.మీ.లు ప్రయాణిస్తే చేరుకోవచ్చు. నాలుగు వైపులా ఆహ్లాదం కలిగించే సుందర దృశ్యాలు ప్రతి సమ్మోహితులను చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని