logo

జగమే ఊగెనులే...

కోణార్క్‌ శిల్ప కళారామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. కళామతల్లికి శాస్త్రీయ నృత్యాభిషేకం జరుగుతోంది. కళాకారిణుల నృత్యాలు ఆహూతులను సమ్మోహితులను చేస్తున్నాయి.

Published : 06 Dec 2022 03:24 IST

కోణార్క్‌లో శాస్త్రీయ నృత్యహేళ

మహిళల ప్రగతిని వివరిస్తూ తీర్చిదిద్దిన ఆకృతి

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: కోణార్క్‌ శిల్ప కళారామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. కళామతల్లికి శాస్త్రీయ నృత్యాభిషేకం జరుగుతోంది. కళాకారిణుల నృత్యాలు ఆహూతులను సమ్మోహితులను చేస్తున్నాయి. ఆదివారం రాత్రి కళావేదికపై ప్రదర్శించిన స్పందన డ్యాన్స్‌ కంపెనీ చెన్నై కళాకారుల భరత నాట్యం, భువనేశ్వర్‌ సురభి డ్యాన్స్‌ అకాడమీ ఒడిస్సీ నృత్యాలు అలరించాయి. మరోవైపు చంద్రభాగ తీరంలో సందేశాత్మక సైకత శిల్పాలు సందర్శకులను ఆలోచింపజేస్తున్నాయి. సైకత పోటీల్లో రష్యా, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాల శిల్పులతోపాటు దేశానికి చెందిన 29 మంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సందర్శకుల సంఖ్య ఈసారి పెరిగిందని పూరీ కలెక్టర్‌ సమర్థవర్మ విలేకరులకు చెప్పారు.

పచ్చదనం లక్ష్యం కావాలన్న సందేశాత్మక శిల్పం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని