logo

మహిళా క్రికెటర్‌ అనుమానాస్పద మృతి..!

ఒడిశా మహిళా క్రికెట్‌ క్రీడాకారిణి రాజశ్రీ స్వయిన్‌ మృతదేహం కటక్‌ సమీపంలోని గురుడు జట్టుయ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవిలో ఒక చెట్టుకు వేలాడుతుండగా శుక్రవారం పోలీసులు గుర్తించారు.

Updated : 14 Jan 2023 11:03 IST

రాజశ్రీ స్వయిన్‌ (పాత చిత్రం)

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశా మహిళా క్రికెట్‌ క్రీడాకారిణి రాజశ్రీ స్వయిన్‌ మృతదేహం కటక్‌ సమీపంలోని గురుడు జట్టుయ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవిలో ఒక చెట్టుకు వేలాడుతుండగా శుక్రవారం పోలీసులు గుర్తించారు. డీసీపీ పీనాక్‌ మిశ్రా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి రాజశ్రీ కనిపించడం లేదని, ఆమె తల్లిదండ్రులు మంగళబాగ్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించిందన్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశామన్నారు. తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని రాజశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని వారు చెబుతున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం... ఈ నెల 18 నుంచి పూడుచూరులో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఒడిశా క్రికెట్‌ అసోసియేషన్‌ 25 మందిని ఎంపిక చేసింది. వీరికి బజరకుబట్టి ప్రాంతంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. రాజశ్రీ అందులో పాల్గొంది. 11న తండ్రి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరి తిరిగి కనిపించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని