logo

వీడని మంచు.. నేడు 9 జిల్లాలకు హెచ్చరికలు

రాష్ట్రంలో మంచుతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకూ ఎండ కనిపించడం లేదు.

Published : 20 Jan 2023 00:54 IST

కొంధమాల్‌ జిల్లా తుమిడి బొంధొ రోడ్డులో గురువారం ఉదయం 8.30 గంటలకు కురుస్తున్న మంచు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మంచుతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకూ ఎండ కనిపించడం లేదు. గురువారం ఉత్తరకోస్తా, దక్షిణ జిల్లాల్లో మంచు కురిసినట్లు గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్‌.మూర్తి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఈ పరిస్థితి శుక్రవారం కూడా ఉంటుందని, గంజాం, గజపతి, నయాగఢ్‌, ఖుర్దా, కొంధమాల్‌, కలహండి, అనుగుల్‌, ఢెంకనాల్‌, కటక్‌ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు చేశామన్నారు. బొలంగీర్‌, సంబల్‌పూర్‌, సుందర్‌గఢ్‌, దేవ్‌గఢ్‌, కేంఝర్‌ జిల్లాల్లో పాక్షికంగా మంచు కురిసే సూచనలున్నాయన్నారు. బంగాళాఖాతం మీదుగా వీస్తున్న గాలుల్లో తేమ ఎక్కువగా ఉంటోందని, ఇది వాయుమండలాన్ని కప్పేస్తున్నందున మంచు కురుస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి ఉత్తర దిశగా గాలుల తీవ్రత తగ్గినందున రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గిందని చెప్పారు. గురువారం కొరాపుట్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా నమోదుకాగా, మిగతా కేంద్రాల్లో 14 నుంచి 19 వరకు ఉన్నట్లు మూర్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని