logo

సముద్ర జలాల కాలుష్యం నివారణకు చర్యలు అవసరం

ప్లాస్టిక్‌, పాలీథిన్‌ వ్యర్థాల వల్ల సాగర, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, పర్యావరణ సమతౌల్యానికిది ముప్పుగా పరిణమిస్తున్నందున శాశ్వత చర్యలు అవసరమని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Published : 20 Jan 2023 00:54 IST

వేదికపై వీసీలు ప్రతాప్‌, ప్రఫుల్ల, ప్రభాకర, డేవిడ్‌, డానియా

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌, పాలీథిన్‌ వ్యర్థాల వల్ల సాగర, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, పర్యావరణ సమతౌల్యానికిది ముప్పుగా పరిణమిస్తున్నందున శాశ్వత చర్యలు అవసరమని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రహ్మపుర విశ్వవిద్యాలయం (భంజవిహార్‌) సాగర అధ్యయన శాస్త్ర విభాగం, ఇంగ్లాండుకి చెందిన పర్యావరణ, జలచర విజ్ఞానకేంద్రం (సెఫస్‌) సంయుక్తంగా భంజవిహార్‌ సమావేశ మందిరంలో ‘సాగర సమతౌల్యానికి ప్లాస్టిక్‌ ముప్పు’ అన్న అంశంపై రెండు రోజుల శిక్షణ సదస్సు బుదవారం రాత్రి ప్రారంభమైంది. భంజవిహార్‌ వీసీ, సాగర అధ్యయన శాస్త్రవేత్త ఆచార్య ప్రతాప్‌కుమార్‌ మహంతి, కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల ఆసియా ఖండంలోని ప్రముఖ చిలికా సరస్సు ప్రాంతాల్లో భంజవిహార్‌ సాగర అధ్యయన శాస్త్ర నిపుణుల బృందం 7 రోజులు పరిశీలించిందని, ఇక్కడ మైక్రో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎక్కడిక్కడ మేటలు వేసి ఉన్నాయన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మపుర కళ్లికోట వర్సిటీ వీసీ ఆచార్య ప్రఫుల్ల కుమార్‌ మహంతి మాట్లాడుతూ... ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర రక్షణ, వ్యర్థాల తొలగింపు, ప్రజల్లో అవగాహన దిశగా కార్యక్రమాలు చేపడుతున్నా, సరిపోవడం లేదన్నారు. ముఖ్య వక్తగా చెన్నై తీర అధ్యయన కేంద్రం సంచాలకుడు ఆచార్య ప్రభాకర మిశ్ర మాట్లాడుతూ... పర్యావరణ కాలుష్యం ముప్పు సాగర జలాలకు చుట్టుముట్టిందని, జలాచరాలపై ప్రభావం పడుతున్నందున సమగ్ర కార్యాచరణ అమలు దిశగా ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ముందుకు రావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని