logo

మోదీ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

ప్రధాని నరేంద్రమోదీ రచించిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ అన్న ఆంగ్ల పుస్తకాన్ని గవర్నరు అచార్య గణేశీలాల్‌ గురువారం రాత్రి రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు.

Published : 21 Jan 2023 05:39 IST

పుస్తకావిష్కరణ చేస్తున్న ఆచార్య గణేశీలాల్‌. చిత్రంలో మంత్రి దాస్‌, అధికారులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ రచించిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ అన్న ఆంగ్ల పుస్తకాన్ని గవర్నరు అచార్య గణేశీలాల్‌ గురువారం రాత్రి రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్ధులకు ‘మన్‌కీ బాత్‌’ (మనసులో మాట) ఆకాశవాణి కార్యక్రమం ద్వారా విలువైన సూచనలిస్తున్న ప్రధాని, తన అనుభవాన్ని రంగరించి రచించిన ఈ పుస్తకం అందరికీ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌, గవర్నరు ప్రత్యేక కార్యదర్శి శాశ్వత మిశ్ర, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అశ్వథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు