అమ్మవారికే స్థలం.. రైల్వే బోర్డు అంగీకారం
దీర్ఘ కాలంగా మజ్జిగౌరి అమ్మవారి ఆలయానికి సొంతం స్థలం కల్పించాలని చేస్తున్న కృషి నెరవేరింది. అప్పట్లో రైల్వే స్థలంలో అమ్మవారి ఆలయం నిర్మించారు.
విశాఖపట్నం డీఆర్ఎం అనూప్ కుమార్ శత్పథి ప్రకటన
భక్తుల ఆరాధ్యదేవత మజ్జిగౌరి అమ్మవారు
రాయగడ, న్యూస్‌టుడే: దీర్ఘ కాలంగా మజ్జిగౌరి అమ్మవారి ఆలయానికి సొంతం స్థలం కల్పించాలని చేస్తున్న కృషి నెరవేరింది. అప్పట్లో రైల్వే స్థలంలో అమ్మవారి ఆలయం నిర్మించారు. అమ్మవారి మందిరానికి సొంతం స్థలం లేకపోవడంతో అనుకున్న మేరకు ఆలయ అభివృద్ధి, భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం, ఆలయట్రస్ట్ చేసిన కృషి ఫలించింది. జీసీడీ క్రీడామైదానంలో జరుగుతున్న చొయితి ఉత్సవ సభకు గురువారం రాత్రి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం రైల్వే డీఆర్ఎం అనూప్ కుమార్ శత్పథి చొయితి వేదికపై అమ్మవారి ఆలయం ఉన్న స్థలం ఆలయానికే కేటాయించేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపిందని అశేష ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. జిల్లా పాలనాధికారి స్వాధాదేవ్ సింగ్ చేసిన కృషి ఫలించిందన్నారు. ఆలయం ఆధీనంలో ఉన్న 6.30 ఎకరాల భూమిని ఆలయ ట్రస్ట్‌కు ఇచ్చేందుకు, అందుకు ప్రతిఫలంగా జిల్లా యంత్రాంగం స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. అమ్మవారి మందిరానికి స్థలం కేటాయింపు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. రానున్న రోజుల్లో రాయగడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
అభివృద్ధికి తొలగిన ఇబ్బందులు
స్థలం కమిటీ పేరిట బదిలీ అయిన వెంటనే అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర దేవాదాయ బోర్డుకు కమిటీ పంపనుంది. భక్తుల సౌకర్యం కోసం గదుల నిర్మాణంతోపాటు, ఉచిత భోజన శాల, కల్యాణ మండపం, ఉద్యోగుల వసతి గృహాలు నిర్మించనున్నాం. ఇప్పటికే మెదటి అంతస్థు పూర్తయిన యాత్రి నివాస్‌పై మరో అంతస్థు నిర్మించనున్నారు. దీంతో ఇతర నిర్మాణాలు జరగనున్నట్లు మజ్జిగౌరి ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు రాయిసింగ్ బిడిక తెలిపారు.
విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న శత్పథి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jee Main 2023: త్వరలోనే జేఈఈ మెయిన్ సెషన్- 1 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!
-
Politics News
Revanth Reddy: రేవంత్ పాదయాత్ర..షెడ్యూల్ ఇదే
-
World News
Pervez Musharraf: భారత్‌లోకి చొరబడి మీటింగ్ పెట్టిన ముషారఫ్..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Hanuma Vihari: అలా చేస్తే నా కెరీర్లో రిస్క్‌లో పడుతుందని ఆయన చెప్పాడు: హనుమ విహారి
-
Movies News
Social Look: హల్దీ వేడుకలో పూజాహెగ్డే.. సమంత ‘లైట్’ పోస్ట్!