logo

కవాతుకు ముగిసిన సాధన

బ్రహ్మపుర సబ్‌ డివిజనల్‌ స్థాయి గణతంత్ర దినోత్సవాల్లో కవాతులో పాల్గొనే బృందాల సాధన సోమవారం సాయంత్రం ముగిసింది.

Published : 25 Jan 2023 02:27 IST

వివిధ కళాశాలలు, పాఠశాలల కేడెట్లు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర సబ్‌ డివిజనల్‌ స్థాయి గణతంత్ర దినోత్సవాల్లో కవాతులో పాల్గొనే బృందాల సాధన సోమవారం సాయంత్రం ముగిసింది. స్థానిక కళ్లికోట వర్సిటీ మైదానంలో నిర్వహించిన దీనికి పరేడ్‌ కమాండెంట్‌, రిజర్వు ఇన్‌స్పెక్టరు దిలీప్‌ బెహరా పర్యవేక్షించారు. సబ్‌ డివిజన్‌లోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 31 బృందాలు కవాతు సాధనలో పాల్గొన్నాయి. వీటితోపాటు పోలీసు, హోంగార్డు, పోలీసు బ్యాండు బృందాలు కూడా పాల్గొని సాధన చేశాయి. కొవిడ్‌ విజృంభణ సమయంలో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో కేడెట్ల కవాతుకు ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం పోలీసు బృందం పాల్గొని ఆయా వేడుకలు నిరాడంబరంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాల కవాతుకు మళ్లీ కేడెట్లను అనుమతించడంతో వారిలో ఉత్సాహం ఉరకలేస్తోంది.

సాధన చేస్తున్న కేడెట్లు

జయపురంలో..

జయపురం, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకల కోసం జయపురం పుడియా మైదానంలో వివిధ పాఠశాల, కళాశాలల ఎన్‌సీసీ, స్కౌట్‌ విద్యార్థులు మంగళవారం సాధన చేశారు. రెండేళ్ల తరువాత జరగనున్న వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు, ఎమ్మెల్యే తారాప్రసాద్‌ తెలిపారు. గురువారం జరిగే కవాతులో 48 బృందాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని