logo

ఆకట్టుకున్న గణతంత్ర వేడుకలు

భువనేశ్వర్‌లోని గాంధీమార్గ్‌లో గురువారం ఏర్పాటైన గణతంత్ర వేడుకలు అలరించాయి. గవర్నరు ఆచార్య గణేశీలాల్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జవానుల గౌరవ వందనం స్వీకరించారు.

Updated : 27 Jan 2023 06:07 IST

పతాకావిష్కరణ చేసిన గణేశీలాల్‌

ప్రత్యేక ఆహ్వానితునిగా నవీన్‌ పట్నాయక్‌

వేదికపై గవర్నరుకు నమస్కరిస్తున్న నవీన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని గాంధీమార్గ్‌లో గురువారం ఏర్పాటైన గణతంత్ర వేడుకలు అలరించాయి. గవర్నరు ఆచార్య గణేశీలాల్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జవానుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితునిగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హాజరయ్యారు. ఉత్సవంలో 8 ప్రభుత్వశాఖలు సాధించిన ప్రగతిని తెలియజేసేలా శకటాలను ప్రదర్శించారు. 30 ప్లటూన్ల పోలీసు బలగాలు, అగ్నిమాపక, ఓడ్రాఫ్‌, ఎన్‌సీసీ, ఎన్నెస్సెస్‌ బృందాలు పాల్గొన్నాయి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీస్‌ బెటాలియన్‌ జవానుల కవాతు ఆకర్షణీయంగా నిలిచింది. భువనేశ్వర్‌ మహర్షి విద్యా సంస్థల విద్యార్ధుల డేర్‌డెవిల్‌ షో అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కొరాపుట్‌, గంజాం, కేంఝర్‌, సుందర్‌గఢ్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల కళాకారుల జానపద నృత్యాలు, కటక్‌, పూరీ జిల్లాల ఒడిస్సీ, గొట్టిపువొ నాట్యాలు కళింగ వైభవాన్ని చాటాయి.కార్యక్రమంలో సురేష్‌ మహాపాత్ర్‌, అభివృద్ధి కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ జెనా, డీజీపీ సునీల్‌ బన్సల్‌, తదితర ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

సాంస్కృతిక బృందం ప్రదర్శన

ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన

గాంధీ మార్గ్‌లో డేర్‌డెవిల్‌ షో


సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి

కేడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న టి.ఆవో. చిత్రంలో సబ్‌కలెక్టరు కులకర్ణి, కమిషనర్‌ జెనా, ఎస్పీ శరవణ వివేక్‌

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: బ్రహ్మపురలో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కళ్లికోట విశ్వవిద్యాలయం క్రీడామైదానంలో బ్రహ్మపుర సబ్‌కలెక్టరు కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన వేడుకల్లో ముఖ్యఅతిథిగా దక్షిణ మండల ఆర్డీసీ టి.ఆవో హాజరై జెండాను ఎగురవేశారు. అనంతరం ఎన్‌సీసీ, నేవల్‌, స్కౌట్స్‌,గైడ్స్‌, ఆర్మీ తదితర కేడెట్ల బృoదాల పరేడ్‌ను తిలకించి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాన్ని అందరు గుర్తు చేసుకోవాలన్నారు. తర్వాత స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ స్కూల్‌, కేసీ పబ్లిక్‌ స్కూల్‌, న్యూ డీపాల్‌, సెయింట్‌ జేవియర్స్‌ కాన్వెంట్‌ స్కూల్‌, డీపాల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన వ్యాయామ ప్రదర్శనలు, విన్యాసాలు అందర్నీ అలరించాయి. కవాతులో బ్రహ్మపుర సబ్‌డివిజనల్‌ స్థాయిలోనున్న 33 బృందాలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో బ్రహ్మపుర సబ్‌కలెక్టరు అశుతోష్‌ కులకర్ణి, బీఈఎంసీ కమిషనర్‌ సొనాల్‌ జెనా, బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ పాల్గొన్నారు. అంతకుముందు బ్రహ్మపుర ఎంపీ చంద్రశేఖరసాహు, ఎమ్మెల్యే బిక్రంకుమార్‌ పండా, బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి కాసేపు కార్యక్రమంలో పాల్గొని ఇతర కార్యక్రమాలకు వెళ్లారు.

కేసీ పబ్లిక్‌ స్కూల్‌ బాలికల ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని