logo

స్వచ్ఛంద రక్తదానంపై చైతన్యానికి 21 వేల కి.మీ. పాదయాత్ర

రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మరొకరి రక్తమే ప్రాణం నిలుపుతుంది.

Published : 27 Jan 2023 01:49 IST

బ్రహ్మపుర చేరుకున్న కిరణ్‌ వర్మ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మరొకరి రక్తమే ప్రాణం నిలుపుతుంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద రక్తదానంపై ప్రజల్లో చైతన్యానికి న్యూ దిల్లీకి చెందిన కిరణ్‌ వర్మ అనే యువకుడు 21 వేల కి.మీ. పాదయాత్ర చేపటారు. ఈ క్రమంలో బుధవారం బ్రహ్మపుర చేరుకున్న వర్మ ‘ఈటీవీ భారత్‌’తో తన పాదయాత్ర గురించి వివరించారు. 2021 సంవత్సరం డిసెంబరు 28న త్రివేండ్రం (కేరళ)లో పాదయాత్ర ప్రారంభించానని, ఇంతవరకూ కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా పాదయాత్ర కొనసాగించి ఒడిశాలోని బ్రహ్మపురకు చేరుకున్నట్లు చెప్పారు. దారి పొడవునా వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలను కలిసి స్వచ్ఛంద రక్తదానంపై చైతన్యం కల్పించానని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని