logo

ఈ కపోతాలు... ఎంతో ప్రత్యేకం

రాష్ట్ర పోలీసు శాఖలో పావురాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, పోలీసు వ్యవస్థాపక దినోత్సవాల్లో ఇవి కనిపిస్తాయి.

Published : 27 Jan 2023 01:49 IST

గణతంత్ర వేడుకల్లో పావురాలతో పోలీసులు

కటక్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర పోలీసు శాఖలో పావురాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, పోలీసు వ్యవస్థాపక దినోత్సవాల్లో ఇవి కనిపిస్తాయి. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే వీటిని ఎగరేస్తారు. ఇలా పైకి ఎగిరిన ఈ పావురాలు తిరిగి కటక్‌లో ఉన్న పోలీస్‌ ప్రిజన్‌కు తమకు తాముగా చేరుకుంటాయి. ఈ పావురాల విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారి అందించిన వివరాల ప్రకారం... ప్రస్తుతం కటక్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో పావురాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు వాటికి ఉంచేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక్కడ 100కు పైగా కపోతాలు ఉన్నాయి. వీటి కోసం ఏటా ప్రత్యేక బడ్జెట్‌ రూ.3 లక్షలు కేటాయిస్తారు. వీటి శిక్షణ, సంరక్షణ కోసం 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక పావురం 15 ఏళ్ల వరకు బతుకుతుంది. రోజుకు రెండుసార్లు వీటికి ప్రత్యేక ఆహారం పెడతారు. రవాణా సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించేందుకు కూడా వీటిని వినియోగిస్తున్నారు. ఈ విభాగం రాష్ట్రానికి ప్రత్యేకమని ఆ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని