logo

తం సూర్యం ప్రణమామ్యహం

మానవాళికి, జీవకోటికి ఆయురారోగ్యాలు ప్రసాదించే ఆదిత్యుని జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకొని పూరీ జిల్లాలోని విశ్వవిఖ్యాత సూర్యనారాయణ.

Published : 28 Jan 2023 02:04 IST

నేడు రథసప్తమి... కోణార్క్‌, గోపాల్‌పూర్‌లో విస్తృత ఏర్పాట్లు

విశ్వవిఖ్యాత బ్లాక్‌ పగోడా కోణార్క్‌ సూర్యనారాయణ మూర్తి ఆలయం

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: మానవాళికి, జీవకోటికి ఆయురారోగ్యాలు ప్రసాదించే ఆదిత్యుని జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకొని పూరీ జిల్లాలోని విశ్వవిఖ్యాత సూర్యనారాయణ మూర్తి కోణార్క్‌ ఆలయానికి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మాఘశుక్ల సప్తమి సూర్యోపాసన రోజు. కోణార్క్‌ చేరువలోని చంద్రభాగ తీరంలో పవిత్ర స్నానాలు చేసి భక్తులంతా ఆ స్వామిని ఆరాధిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పూరీ జిల్లా యంత్రాంగం కోణార్క్‌లో భద్రత కట్టుదిట్టం చేసింది. కొవిడ్‌ వల్ల రథసప్తమి స్నానాలు, పూజలకు రెండేళ్లు దూరమైన వారంతా ఈసారి వేడుకల్లో పాల్గొననున్నారు. గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌ తీరంలోనూ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్నానాలు, పూజలు చేయనున్నారు. పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని