logo

నిస్వార్థ సేవకు సత్కారం

చాలా కాలం క్రితం ఒక వ్యక్తి వంశధార నది తీరానికి సేద తీరేందుకు వెళ్లాడు. ప్రశాంతత విషయం పక్కన పెడితే అక్కడ చెత్తాచెదారం, మానవ వ్యర్థాలు, నీటి కలుషితం చూసి ఆవేదన చెందాడు.

Published : 28 Jan 2023 02:04 IST

వంశధార నది తీరంలో చీపురుతో ఊడుస్తున్న సారథి

గుణుపురం, నూస్‌టుడే: చాలా కాలం క్రితం ఒక వ్యక్తి వంశధార నది తీరానికి సేద తీరేందుకు వెళ్లాడు. ప్రశాంతత విషయం పక్కన పెడితే అక్కడ చెత్తాచెదారం, మానవ వ్యర్థాలు, నీటి కలుషితం చూసి ఆవేదన చెందాడు. ఆ క్షణమే తీరాన్ని శుభ్రంగా ఉంచాలని నిర్ణయించాడు. పదేళ్లుగా ప్రతీ రోజు తీరాన్ని శుభ్రం చేయడం ఒక పనిగా పెట్టుకుని, ప్రజల్లోనూ చైతన్యం కల్పించాడు.. అతడే సారథి శ్రీరాం. దళిత కుటుంబానికి చెందిన సారథి రోజూ తీరాని వెళ్లి శుభ్రం చేస్తారు. తీరంలో మలమూత్రాలు విసర్జిస్తే ఏ మాత్రం సంశయించకుండా వాటిని గొయ్యి తీసి కప్పుతారు. కొన్ని నెలల కిందట తీరంలో బెంచీలు ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలు కూడా నాటారు. ఈయన చేస్తున్న నిస్వార్థ సేవను మెచ్చి యంత్రాంగం, పలువురు గతంలో సత్కారించారు. శుక్రవారం కటికా వీధికి చెందిన యువత ఘనంగా సన్మానించింది. నిరుపేద అయిన సారథి సేవకు డబ్బుతో పని లేదని చెబుతూనే పదిమందికి స్ఫూర్తిదాయకంగా మారాడని పలువురు అభినందిస్తున్నారు.

సత్కరిస్తున్న యువత, పెద్దలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని