logo

రాజధానిలో రాయ్‌ఘర్‌ కూరగాయలకు గిరాకీ

భువనేశ్వర్‌లో నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ కూరగాయలకు గిరాకీ పెరిగింది. దాంతో ప్రతి రోజు బస్సుల్లో 20-25 క్వింటాళ్ల కూరగాయలు రాజధానికి ఎగుమతి అవుతున్నాయి.

Published : 28 Jan 2023 02:04 IST

బస్సుపైకి కూరగాయల బస్తాలు ఎక్కిస్తున్న రైతు

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లో నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ కూరగాయలకు గిరాకీ పెరిగింది. దాంతో ప్రతి రోజు బస్సుల్లో 20-25 క్వింటాళ్ల కూరగాయలు రాజధానికి ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడి రైతులు రాగులు, మొక్కజొన్న వరి మాత్రమే సాగు చేసేవారు అయితే కూరగాయలకు ఉంటున్న గిరాకీని గమనించి గత రెండేళ్లుగా సమితిలో 100 ఎకరాల్లో రైతులు వివిధ కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ఇందులో లాభాలు చూస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ... కూరగాయలు సాగుతో తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలు పొందుతున్నారని తెలిపారు. సాగు నీరు కూడా ఎక్కువగా అవసరం రాకపోవడం కలిసొచ్చిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు