logo

బీఈఎంసీ కమిషనర్‌ పేరిట నకిలీ వాట్సాప్‌ ఖాతా

బ్రహ్మపుర నగరపాలక సంస్థ (బీఈఎంసీ) కమిషనర్‌ జె.సొనాల్‌ పేరిట సైబర్‌ మోసగాళ్లు నకిలీ వాట్సాప్‌ ఖాతా రూపొందించారు.

Published : 28 Jan 2023 02:04 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర నగరపాలక సంస్థ (బీఈఎంసీ) కమిషనర్‌ జె.సొనాల్‌ పేరిట సైబర్‌ మోసగాళ్లు నకిలీ వాట్సాప్‌ ఖాతా రూపొందించారు. దాని ద్వారా పలువురు ఉద్యోగులు, ప్రజలకు వివిధ లింక్‌లు పంపించి సొమ్ము, బహుమతులు అడుగుతున్నారని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై స్థానిక సైబర్‌, ఆర్థిక నేరాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలెవరూ ఈ మెసేజ్‌లకు స్పందించొద్దని, ఒకవేళ ఎవరైనా బాధితులుంటే తక్షణం సమీప ఠాణాలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు