logo

మినీ మారథాన్‌కు మంచి స్పందన

కిట్‌ సిల్వర్‌ జూబ్లీని పురస్కరించుకొని రాయగడలో ఆదివారం నిర్వహించిన మినీ మారథాన్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.

Published : 30 Jan 2023 02:17 IST

రాయగడలో జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభిస్తున్న వివేకానంద

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: కిట్‌ సిల్వర్‌ జూబ్లీని పురస్కరించుకొని రాయగడలో ఆదివారం నిర్వహించిన మినీ మారథాన్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. సెరిగూడ కూడలి వద్ద మొదలైన ఈ మారథాన్‌ను ఎస్పీ వివేకానంద శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అందరికీ విద్య అనే అంశంపై చైతన్య కల్పించాలని నిర్వహించిన ఈ మారథాన్‌లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెరిగూడ నుంచి జీఐఏసీఆర్‌ కూడలి వరకు మారథాన్‌ కొనసాగినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, ఎమ్మెల్యే మకరంద ముదులి తదితరులు పాల్గొన్నారు.

మల్కాన్‌గిరి డీఎన్‌కే మైదానంలో విద్యార్థులు..

మల్కాన్‌గిరిలో..

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి పట్టణంలో కిట్‌ సంస్థ తరఫున మినీ మారథాన్‌ జరిగింది. ఆదివారం సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాన్‌గిరి ఎస్పీ నితీశ్‌ వాద్వానీ, అటవీ అధికారి ప్రతాప్‌ కొత్తపల్లి పాల్గొన్నారు. మల్కాన్‌గిరి స్టేడియం నుంచి డీఎన్‌కే మైదానం వరకు కొనసాగిన పరుగులో మల్కాన్‌గిరి పట్టణం జవాహార్‌ నవోదయ పాఠశాల, మహిళా కళాశాల, మోడ్రన్‌ ఇంగ్లీష్‌ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని