logo

అందరికీ విద్య ఎంతో అవసరం

అందరూ విద్యావంతులుగా మారాలని, ఈమేరకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కిట్‌, కిస్‌ సంస్థల ఆధ్వర్యంలో రాజధానితోపాటు దేశవిదేశాల్లో ఆదివారం మారథాన్‌ నిర్వహించారు.

Published : 30 Jan 2023 02:17 IST

రాజధానిలో ఉత్సాహంగా మారథాన్‌

పాల్గొన్న ఎంపీ అచ్యుత సామంత, బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌,
ఓలీవుడ్‌ సినీ నటుడు సవ్యసాచి మిశ్రా, హీరోయిన్‌ అర్చిత తదితరులు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: అందరూ విద్యావంతులుగా మారాలని, ఈమేరకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కిట్‌, కిస్‌ సంస్థల ఆధ్వర్యంలో రాజధానితోపాటు దేశవిదేశాల్లో ఆదివారం మారథాన్‌ నిర్వహించారు. భువనేశ్వర్‌లో శాండీ టవర్‌ నుంచి కిట్‌ మైదానం వరకు ఈ పరుగు కొనసాగింది. కార్యక్రమంలో 30 వేల మంది విద్యార్థులతోపాటు కిట్‌ వ్యవస్థాపకుడు, ఎంపీ అచ్యుత సామంత, బాలీవుడ్‌ సినీ నటుడు రాహుల్‌ బోస్‌, ఒడియా సినీ నటుడు సవ్యసాచి మిశ్రా, హీరోయిన్‌ అర్చిత, అథ్లెట్‌ ద్యుతిచంద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుత సామంత మీడియాతో మాట్లాడుతూ అందరికీ విద్య అవసరం అనే అంశంపై చైతన్యం కలిగించేందుకు ఏటా ఈ పరుగులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది భువనేశ్వర్‌తోపాటు రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో, దేశంలోని 25 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, కెమెరూన్‌, జింబాబ్వే తదితర దేశాల్లోనూ మారథాన్‌ నిర్వహించినట్లు తెలిపారు.

పరుగులో పాల్గొన్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని