logo

గిన్నిస్‌ బుక్‌లో బిర్సాముండా స్టేడియానికి స్థానం

సుందర్‌గఢ్‌ జిల్లా రవుర్కెలాలోని బిర్సాముండ హాకీ స్టేడియం ప్రపంచంలోనే పెద్దదిగా గిన్నిస్‌బుక్‌ అఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.

Published : 30 Jan 2023 02:17 IST

క్రీడా మైదానం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సుందర్‌గఢ్‌ జిల్లా రవుర్కెలాలోని బిర్సాముండ హాకీ స్టేడియం ప్రపంచంలోనే పెద్దదిగా గిన్నిస్‌బుక్‌ అఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. 5-టీ కార్యదర్శి వి.కార్తికేయపాండ్యన్‌ ఈ విషయాన్ని ఆదివారం స్వయంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు తెలియజేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ప్రపంచకప్‌ హాకీ (పురుషులు) పోటీలకు స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవల పోటీల ప్రారంభానికి ముందు ఈ క్రీడామైదాన ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. ఈ పనులకు సుమారు రు.1200 కోట్లు వెచ్చించారు. 15 నెలల్లో పనులు పూర్తి చేశారు. 21,800 మంది కూర్చొని తిలకించే వెసులుబాటుంది. అత్యాధునిక సౌకర్యాలున్నాయి. దీన్ని గతనెల (జనవరి)లో శుభారంభం చేసిన నవీన్‌ ఈ స్టేడియం రాష్ట్ర గౌరవంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ మైదానం గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని