logo

బాలుని పొట్టలోకి దూసుకుపోయిన ఈటె

బొలంగీర్‌ జిల్లా బెల్‌పడా సమితి ఐలాబట్టా గ్రామంలో 13 ఏళ్ల బాలుని కడుపులోకి ఈటె దూసుకుపోయింది. ఆయనకు బీమబోయి వైద్యకళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Published : 30 Jan 2023 02:17 IST

పొట్టలో ఈటెతో రాజు

కటక్‌, న్యూస్‌టుడే: బొలంగీర్‌ జిల్లా బెల్‌పడా సమితి ఐలాబట్టా గ్రామంలో 13 ఏళ్ల బాలుని కడుపులోకి ఈటె దూసుకుపోయింది. ఆయనకు బీమబోయి వైద్యకళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐలాబట్టా గ్రామానికి చెందిన రాజు (13) చెరువులో చేపలు వేటాడేందుకు సొంతంగా 6 అడుగుల పొడవైన ఈటె తయారు చేశాడు. దానిని పట్టుకొని ఆదివారం ఇంటి నుంచి గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు బయలు దేరాడు. పొలం గట్టుపై నడిచి వెళుతూ కాలు జారి పడిపోయాడు. దీంతో ఆయన చేతిలో ఉన్న ఈటె కడుపులో గుచ్చుకుంది. గమనించిన గ్రామస్థులు ఆయనను తొలుత బొలంగీర్‌ జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రానికి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడి నుంచి బీమబోయి వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుని పొట్టలో గుచ్చుకుని పరికరాన్ని తీసేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని