logo

కృష్ణసార జింకల లెక్కింపు

జీవ వైవిధ్యానికి ప్రతీకగా చెప్పుకొనే గంజాం జిల్లాలో ‘కృష్ణసార జింక’ (బ్లాక్‌బక్‌) ఒకటి. జిల్లాలోని బ్రహ్మపుర, దక్షిణ, ఉత్తర ఘుముసుర అటవీ డివిజన్‌లలో వీటి సంతతి అంతకంతకూ పెరుగుతోంది.

Published : 30 Jan 2023 02:17 IST

గంజాం జిల్లా ఖ్యాతి కృష్ణసార జింకలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: జీవ వైవిధ్యానికి ప్రతీకగా చెప్పుకొనే గంజాం జిల్లాలో ‘కృష్ణసార జింక’ (బ్లాక్‌బక్‌) ఒకటి. జిల్లాలోని బ్రహ్మపుర, దక్షిణ, ఉత్తర ఘుముసుర అటవీ డివిజన్‌లలో వీటి సంతతి అంతకంతకూ పెరుగుతోంది. గతంలో దక్షిణ ఘుముసుర అటవీ డివిజన్‌కు పరిమితమైన జింకలు ఇప్పుడు ఉత్తర ఘుముసుర, బ్రహ్మపుర అటవీ డివిజన్‌లకూ విస్తరించాయి. జిల్లా ఖ్యాతిగా పిలవబడుతున్న బ్లాక్‌బక్‌ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం చేపట్టారు. బ్రహ్మపుర డివిజన్‌లోని బ్రహ్మపుర, దిగపొహండి, కళ్లికోట రేంజ్‌లలో లెక్కించామని బ్రహ్మపుర అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) అమ్లాన్‌ నాయక్‌ మధ్యాహ్నం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. మొత్తం 76 మంది అధికారులు, సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని ఉత్తర, దక్షిణ ఘుముసురలలోనూ కృష్ణసార జింకలను లెక్కించినట్లు తెలిపారు. సంఖ్య వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని