logo

వ్యవసాయ సామగ్రిపై రాయితీలు

అన్నదాతల ప్రయోజనాలు, అధికోత్పత్తులు ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ సామగ్రికి రాయితీలు ఇస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ, మత్స్య, పాఢి శాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌ కోరారు.

Published : 30 Jan 2023 02:17 IST

సంబల్‌పూర్‌ కృషక్‌ మేళాలో మంత్రి రాణేంద్ర

మేళాను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్నమంత్రి రాణేంద్ర, ఇతర అధికారులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అన్నదాతల ప్రయోజనాలు, అధికోత్పత్తులు ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ సామగ్రికి రాయితీలు ఇస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ, మత్స్య, పాఢి శాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌ కోరారు. సంబల్‌పూర్‌ క్రీడా మైదానంలో ‘పశ్చిమ ఒడిశా కృషక్‌ మేళా-2023’ మూడు రోజుల ప్రదర్శనను ఆయన శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. యంత్ర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం రుణాలు, రాయితీలు ఇస్తోందని, అన్నదాతలు దీనిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ ఎస్‌.కె.వశిష్ఠ, ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద పాఢి తదితర అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ మేళాలో ట్రాక్టర్లు, పంట నూర్పిడి యంత్రాలు, ఇతర సామగ్రి ప్రదర్శన, విక్రయాలు చేశారు. వినియోగానికి సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మేళాలో పశ్చిమ ఒడిశాకు చెందిన కృషక్‌ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ప్రదర్శనలో యంత్ర సామగ్రి చూస్తున్న మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని