logo

21 మంది విద్యార్థులకు అస్వస్థత

నువాపడ జిల్లా కోమన సమితి ప్రాంతంలోని సేలబట్‌ ఆవాసిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కోమన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Published : 02 Feb 2023 02:18 IST

ఆసుపత్రిలో కూర్చున్న చిన్నారులు

కటక్‌, న్యూస్‌టుడే: నువాపడ జిల్లా కోమన సమితి ప్రాంతంలోని సేలబట్‌ ఆవాసిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కోమన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు విద్యార్థులకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పాఠశాలలో 44 మంది విద్యార్థులు మంగళవారం రాత్రి అన్నం, గుడ్డు తిన్నారని కొంతసేపటికి ఒకరు తరువాత ఒకరు వాంతులు చేసుకున్నారని వార్డెన్‌ వెల్లడించారు. బుధవారం విద్యార్థులు కోలుకున్నట్లు చెప్పారు. సమితి విద్యాధికారి హేమనంద్‌ మాట్లాడుతూ.. 44 మంది విద్యార్థులు భోజనం చేయగా 21 మందికి ఇలా జరిగిందని ఆహారం విషపూరితం అయిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని