logo

వీసీ హామీతో విద్యార్థినుల ధర్నా విరమణ

బ్రహ్మపుర విశ్వవిద్యాలయం(భంజవిహార్‌) పాలనా భవనం వద్ద మంగళవారం రాత్రి ధర్నా చేసిన బ్రహ్మపుర శశిభూషణ్‌ రథ్‌ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినులతో ఉపకులపతి(వీసీ) ఆచ్యారిణి గీతాంజలి దాస్‌ మాట్లాడారు.

Published : 02 Feb 2023 02:18 IST

రాత్రి (మంగళవారం) ధర్నా చేసిన విద్యార్థినులతో మాట్లాడుతున్న వీసీ ఆచార్యిణి గీతాంజలి

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: బ్రహ్మపుర విశ్వవిద్యాలయం(భంజవిహార్‌) పాలనా భవనం వద్ద మంగళవారం రాత్రి ధర్నా చేసిన బ్రహ్మపుర శశిభూషణ్‌ రథ్‌ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినులతో ఉపకులపతి(వీసీ) ఆచ్యారిణి గీతాంజలి దాస్‌ మాట్లాడారు. అసలేం జరిగిందంటే.. 2022 మే నెలలో ప్లస్‌త్రీ మూడో సంవత్సరం(ఫైనల్‌) 3వ సెమిస్టర్‌ పరీక్షల్లో ఆంగ్ల ప్రశ్న పత్రంలో సిలబస్‌లో లేని ప్రశ్నలున్నాయి. అప్పట్లో దీనిపై విద్యార్ధినులు కళాశాల ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకొని రాగా పొరపాటు జరిగినట్లు తెలిపారు. మూల్యాంకనం సమయంలో ఈ సబ్జెక్టుకి సంబంధించి గ్రేస్‌ మార్కులు వేసి ఉత్తీర్ణులుగా చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 27న ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో అందరూ ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు న్యాయం చేయాలని వర్సీటీలో ఆందోళన చేశారు. కళాశాల యంత్రాంగంతో సంప్రదించి న్యాయం చేస్తామని వీసీ హామీ ఇవ్వడంతో విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని