logo

జేపీ దాస్‌కు మంత్రి హత్య కేసు పర్యవేక్షణ

మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యకేసు దర్యాప్తు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జె.పి.దాస్‌ పర్యవేక్షించనున్నట్లు న్యాయస్థానం బుధవారం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యత క్రైంబ్రాంచ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Published : 02 Feb 2023 02:18 IST

భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యకేసు దర్యాప్తు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జె.పి.దాస్‌ పర్యవేక్షించనున్నట్లు న్యాయస్థానం బుధవారం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యత క్రైంబ్రాంచ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని, విశ్వసనీయత ఉండదని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన తరువాత ప్రభుత్వం హైకోర్టుకి లేఖ రాసింది. దర్యాప్తు పర్యవేక్షించేందుకు విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తికి లేదా మాజీ న్యాయమూర్తిని నియమించాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు దాస్‌కు ఈ బాధ్యత అప్పగించింది. క్రైంబ్రాంచ్‌ తన దర్యాప్తు వివరాలు న్యాయమూర్తికి తెలియజేయాల్సి ఉంటుంది. మరో వైపు హోంశాఖ... మంత్రి నబకిశోర్‌ దాస్‌ వద్ద పీఎస్‌ఓగా విధులు నిర్వహించిన మిత్రభాను దేవ్‌ను బుధవారం సస్పెండ్‌ చేసింది. బ్రజరాజ్‌నగర్‌ ఠాణా ఐఐసీ ప్రదుమ్న కుమార్‌ స్వయిన్‌, ఎస్‌ఐ శశిభూషణ్‌ పాఢిలను బదిలీ చేసింది. దీనికి ముందుగా ఝార్సుగుడ ఎస్పీ, బ్రజరాజనగర్‌ ఎస్డీపీఓలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని