logo

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడగా, ప్రియురాలు మృతి చెందగా, రక్తపు మడుగుల్లో ప్రియుడు పడి ఉన్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. నవరంగపూర్‌ జిల్లా పపడాహండి పోలీసు అధికారి దీపక్‌ జెనా తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 02 Feb 2023 02:35 IST

ప్రియురాలు మృతి
ప్రియుడి పరిస్థితి విషమం

ఘటనాస్థలంలో యువతి మృతదేహం, పక్కన యువకుడు

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడగా, ప్రియురాలు మృతి చెందగా, రక్తపు మడుగుల్లో ప్రియుడు పడి ఉన్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. నవరంగపూర్‌ జిల్లా పపడాహండి పోలీసు అధికారి దీపక్‌ జెనా తెలిపిన వివరాల ప్రకారం.. సమితిలో సిరిణహ పంచాయతీ సొరిసపొదర గ్రామానికి చెందిన కవిత బొత్ర(21), పపడాహండి పంచాయతీ తండగూడ గ్రామానికి చెందిన కమల్‌ సింగ్‌ అమానత్య ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తండగూడ గ్రామంలో ఉన్న సిమెంట్‌ తయారీ పరిశ్రమలో వీరిద్దరూ పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా, బుధవారం ఉదయం ప్రియురాలు మృతదేహం పక్కన గొంతు దగ్గర తీవ్ర గాయంతో ప్రియుడు పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి వారు చేరుకుని యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అతడి పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి కొరాపుట్‌ షాహిద్‌ లక్ష్మణ్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, క్లూస్‌ టీం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని