logo

బీడీ కార్మికులకు బకాయిలు చెల్లించండి

బీడీ ఆకు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సాంకేతిక ఆధారిత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.

Published : 02 Feb 2023 02:18 IST

బీడీ ఆకులను ఎండబెడుతున్న కార్మికులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: బీడీ ఆకు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సాంకేతిక ఆధారిత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్ర్‌ అధ్యక్షతన దృశ్యశ్రవణ(వర్చువల్‌)విధానంలో జరిగిన బీడీ ఆకు సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అటవీ ముఖ్య సంరక్షణ అధికారి(బీడీ ఆకులు) పూసా జులే మెక్రో స్పందిస్తూ 2022లో 2.78లక్షల క్వింటాళ్ల బీడీ ఆకులు సేకరించాలని లక్ష్యం నిర్దేశించమన్నారు. 99.8శాతం లక్ష్యసాధనతో 2.77లక్షల క్వింటాళ్లను సేకరించమన్నారు. నిధుల ఖర్చుకు సంబంధించిన కమిటీ పనితీరును మెక్రో ప్రశంసించారు. ఇప్పటి వరకూ రూ.409.16కోట్లను వినియోగించామని తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.12.94 కోట్లను వెచ్చించాల్సి ఉందని ఆమె వెల్లడించారు.

రూ.133 కోట్ల పంపిణీ పూర్తి

2022కు సంబంధించి ఇప్పటికే రూ.133.60కోట్లను బీడీ ఆకు లబ్ధిదారులకు చెల్లించామని పేర్కొన్నారు. అదనంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రంలో ఉన్న  8.12లక్షల మంది బీడీ ఆకు కార్మికులు, బైండర్లు, సీజనల్‌ సిబ్బందికి అదనంగా మరో రూ.83.16 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు స్పష్టం చేశారు.లబ్ధిదారుల మరణ ధ్రువీకరణ వివరాల కోసం ఓఆర్‌ఎస్‌ఏసీ సహకారంతో ‘కేఎల్‌ అనుకంప’ అనే మొబైల్‌ యాప్‌ను నెల రోజుల్లో రూపొందించనున్నట్లు ఆమె వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని