logo

నిండు చూలాలికి నరకయాతన

ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ మహిళకు అంబులెన్సు దొరకలేదు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేరు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో 8కి.మీ. బుట్టలో మోసుకుని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది.

Updated : 02 Feb 2023 11:23 IST

బుట్టలో తరలింపు  మార్గమధ్యంలో ప్రసవం

గర్భిణిను మోసుకెళ్తున్న బంధువులు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ మహిళకు అంబులెన్సు దొరకలేదు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేరు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో 8కి.మీ. బుట్టలో మోసుకుని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. ఈ సంఘటన మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పపులుర్‌ పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం పపులుర్‌ పంచాయతీ నయిడగుడ గ్రామానికి చెందిన రామచంద్ర శిశా భార్య భాను శిశాకి పురిటినొప్పులు ప్రారంభమైంది. భర్త వెంటనే ఆశా కార్యకర్త నీలిమ ఖోరకు సమాచారం అందజేయగా ఆమె పపులుర్‌ ఆరోగ్య కేంద్రానికి అంబులెన్సు కోసం ఫోన్‌ చేశారు. అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో కుటుంబ సభ్యులు భానుని ఓ బుట్టలో ఉంచి తీసుకొస్తున్న సమయంలో సగం దారిలో భాను బిడ్డను ప్రసవించింది. అనంతరం ఆమెను పపులర్‌ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఓ అంబులెన్సు రావడంతో తల్లీబిడ్డను చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారు బాగున్నట్లు వైద్యులు చెప్పారు.

ఆరోగ్య కేంద్రంలో తల్లీబిడ్డ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని