logo

జి.ఉదయగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత

రాష్ట్రంపై మళ్లీ ఉత్తర దిశగా వీస్తున్న చలిగాలుల ప్రభావం పెరిగింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్‌.మూర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Published : 04 Feb 2023 03:08 IST

మళ్లీ వణికిస్తున్న చలి

సుందర్‌గఢ్‌ జిల్లా రాజ్‌గంగపూర్‌లో శుక్రవారం ఉదయం మంట వేసుకుని చలి కాచుకుంటున్న స్థానికులు

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంపై మళ్లీ ఉత్తర దిశగా వీస్తున్న చలిగాలుల ప్రభావం పెరిగింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్‌.మూర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. శుక్రవారం కొంధమాల్‌ జిల్లా జి.ఉదయగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదు కాగా, జిల్లా కేంద్రం ఫుల్బాణిలో 5.5 డిగ్రీలు నమోదైనట్లు చెప్పారు. మిగతా కేంద్రాల్లో 9 నుంచి 17 డిగ్రీల లోపుగా ఉందన్నారు. ఝార్సుగుడ, సుందర్‌గఢ్‌ జిల్లాల్లో చలిగాలులు వీచాయన్నారు. శనివారం కలహండి, సుందర్‌గఢ్‌, ఝార్సుగుడ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో ‘ఎల్లో’ హెచ్చరికలు చేశామన్నారు. మరో అయిదు రోజుల వరకు ఉత్తరాది చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల ప్రజలు మంటలు చేసుకుని చలి కాచుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని