logo

మానవత్వం మరిచిన బస్సు సిబ్బంది

బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి మృతదేహాన్ని రహదారి పక్కన వదిలి వెళ్లిపోయిన బస్సు సిబ్బంది అమానుష ప్రవర్తనపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 04 Feb 2023 03:08 IST

తల్లి రును స్వయిన్‌ మృతదేహం వద్ద కొడుకు సుజిత్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి మృతదేహాన్ని రహదారి పక్కన వదిలి వెళ్లిపోయిన బస్సు సిబ్బంది అమానుష ప్రవర్తనపై విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాం జిల్లా పట్టపూర్‌ సమీపాన గౌతమి పంచాయతీలోని పద్మతుల గ్రామానికి చెందిన రును స్వయిన్‌ (60)కు కొడుకు సుజిత్‌ స్వయిన్‌ భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. గురువారం ఆయన తల్లితో కలిసి భువనేశ్వర్‌ నుంచి ఓ ప్రైవేటు బస్సులో సొంతూరు బయలుదేరాడు. సాయంత్రం హుమ్మా-గంజాం మధ్యలో తల్లి ఆరోగ్యం మరింత క్షీణించి మృతిచెందింది. విషయాన్ని ఆయన బస్సు సిబ్బందికి తెలియజేశాడు. దీంతో వారు మార్గమధ్యంలో శనీశ్వర మందిరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన కొడుకుతోపాటు రును మృతదేహాన్ని దించేసి వెళ్లిపోయారు. రహదారి పక్కన కన్నతల్లి మృతదేహంతో ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్న సుజిత్‌ నుంచి వివరాలు తెలుసుకున్న గంజాం పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సుధీర్‌ కుమార్‌ పాఢి స్పందించారు. కొంత ఆర్థిక సాయం చేయడంతోపాటు రును మృతదేహాన్ని సొంతూరు తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని