logo

రాయగడ రైల్వే డివిజన్‌కు రూ.10 కోట్లు

తూర్పు కోస్తా రైల్వేజోన్‌ పరిధిలో రాయగడ కొత్త డివిజన్‌కు రూ.10 కోట్లను కేంద్రం కేటాయించింది.

Published : 05 Feb 2023 03:16 IST

అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో మరికొన్ని ప్రాజెక్టులకు నిధులు

రాయగడలో కొనసాగుతున్న విజయనగరం-టిట్లాగఢ్‌ మూడో లైను పనులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వేజోన్‌ పరిధిలో రాయగడ కొత్త డివిజన్‌కు రూ.10 కోట్లను కేంద్రం కేటాయించింది. అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు రైల్వే మంత్రిత్వశాఖ నిధులు ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం వాల్తేరు డివిజన్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... రాయగడ డివిజన్‌తోపాటు రాయగడ మీదుగా వేస్తున్న విజయనగరం- టిట్లాగఢ్‌ మూడో లైను, కొరాపుట్‌- సింగుపూర్‌ రోడ్‌, జగదల్‌పూర్‌- కొరాపుట్‌, నువాపడ- గుణుపురం. జయపురం- మల్కాన్‌గిరి, జయపురం- నవరంగపూర్‌ రైలు మార్గాలకు నిధులను కేటాయించింది.  కొరాపుట్‌- సింగుపూర్‌ రోడ్‌, సింగుపూర్‌- విజయనగరం మార్గాల్లో రైలు పట్టాల ఆధునికీకరణకు ఈసారి బడ్జెట్‌లో అవకాశం కల్పించింది. వీటిలో విజయనగరం- టిట్లాగఢ్‌ మూడో లైనుకు అధిక ప్రాధాన్యమిస్తూ అత్యధికంగా రూ.920 కోట్లు కేటాయించడం గమనార్హం. నువాపడ- గుణుపురం రైలు మార్గాన్ని రాయగడ జిల్లాలో తెరువలి వరకు పొడిగింపునకు రూ.50 కోట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాయగడ డివిజన్‌ కోసం రూ.10 కోట్లు మాత్రమే ప్రకటించడంపై పెదవి విరుస్తున్నారు.

రాయగడ రైల్వే స్టేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని