logo

పక్కదారి పడుతున్న పీఎంఏవై ఇళ్లు: భాజపా

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనాలో అవకతవకలు జరుగుతున్నాయని నిరసిస్తూ గుసాని, గుమ్మ సమితుల కార్యాలయాలను గజపతి భాజపా నాయకులు ముట్టడించారు.

Published : 05 Feb 2023 03:16 IST

గుసాని సమితి కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న భాజపా నాయకులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనాలో అవకతవకలు జరుగుతున్నాయని నిరసిస్తూ గుసాని, గుమ్మ సమితుల కార్యాలయాలను గజపతి భాజపా నాయకులు ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడమే కాకుండా పేద ప్రజలకు ఇళ్లు కూడా అందజేయడం లేదని వారు ఆరోపించారు. గతంలో జాబితాలో ఉన్న లబ్ధిదారులను తొలగించి అనర్హుల పేర్లతో బిజద నాయకులు ప్రతిపాదించడం సమంజసం కాదని భాజపా నేత శ్రీధర్‌ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతిపత్రాన్ని బీడీవోకు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సిద్ధేశ్వర మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గుమ్మ సమితి కార్యాలయ ప్రాంగణంలో  సమితి మండల అధ్యక్షుడు కృష్ణచంద్ర బిసొయ్‌, అరుణిమ సాహు తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు.


అర్హులకు అందని ఇళ్లు..

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆవాస్‌ యోజనలో పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి బలభద్ర మాఝి అన్నారు. శనివారం నవరంగపూర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకాలంలో లబ్ధిదారుల జాబితా సమర్పించలేకపోయినా రాష్ట్రానికి 9,68,000 ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. అయినా పలుచోట్ల అర్హులకు అందని పరిస్థితి ఉందన్నారు. నవరంగపూర్‌ జిల్లాలో ఒకేఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందని, మిగిలిన 9 సమితుల్లో ఎక్కడా లేదని, విద్యార్థుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ బిసోయి, నాయకులు దేవ్‌దాస్‌ మహాంకుడ్‌, శుభమ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


నవరంగపూర్‌ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న భాజపా నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని