logo

సందడిగా వంశధార వసంతోత్సవాలు

గుణుపురం పట్టణంలో పది రోజులుగా జరుగుతున్న వంశధార వసంతోత్సవాలు శుక్రవారం రాత్రితో సందడిగా ముగిశాయి.

Published : 05 Feb 2023 03:16 IST

అందరినీ అలరించిన నృత్యాలు

సంబలపురి నృత్యం చేస్తున్న విద్యార్ధులు

గుణుపురం, నూస్‌టుడే:  గుణుపురం పట్టణంలో పది రోజులుగా జరుగుతున్న వంశధార వసంతోత్సవాలు శుక్రవారం రాత్రితో సందడిగా ముగిశాయి. వాస్తవంగా బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి జగన్నాథ్‌ సరకా ముఖ్య మాట్లాడుతూ ఉత్సవాలకు ప్రజాదరణ చూసి మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో పరిసర గ్రామాల నృత్య కళాకారులు, గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. చివర రోజున స్థానిక యువకుల గ్రామీణ జానపదం, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆదివాసీ, సంబలపురి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణ చిన్నారులు ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు అక్షరదాస్‌, ఉపాధ్యక్షులు ఉమా దాస్‌, కార్యదర్శి రంజిత్‌ పాఢిలతో పాటు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన కళాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ ఏడాది వేడుకల్లో నెల రోజుల పాటు క్రీడోత్సవాలు కొనసాగగా... రెండు రోజులు ఆధ్యాత్మిక, ఎనిమిది రోజులు సాంస్కృతిక కార్యాక్రమాలు అలరించాయి. వందకు పైగా స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. వీటిలో వ్యాపారాలు జోరుగా సాగాయి. పట్టణ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి చిన్న పెద్ద అందరూ తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం కిటకిటలాడింది. ఇక వినోదానికి మీనా బజారు వేదికైంది.

స్థానిక కళాకారుల జానపద నృత్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని