logo

రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనసభ్యుడు మృతి

జాజ్‌పూర్‌ జిల్లా బింజార్పూర్‌ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు అర్జున్‌ చరణ్‌ దాస్‌ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Published : 05 Feb 2023 03:16 IST

అర్జున్‌చరణ్‌ దాస్‌ (పాత చిత్రం)

కటక్‌, న్యూస్‌టుడే: జాజ్‌పూర్‌ జిల్లా బింజార్పూర్‌ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు అర్జున్‌ చరణ్‌ దాస్‌ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 1999లో ఆయన కాంగ్రెస్‌ టిక్కెట్‌పై బింజార్పూర్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనేశ్వర్‌లో శనివారం జరగనున్న ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్జున్‌ చరణ్‌ దాస్‌ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వస్తుండగా జాజ్‌పూర్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరస్రోత నది గట్టుపై ఇసుకలారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అర్జున్‌ చరణ్‌ దాస్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన స్నేహితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కటక్‌ ఎస్సీబీ వైద్య కళాశాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని