logo

క్యాన్సర్‌ నివారణపై అవగాహన అవసరం

క్యాన్సర్‌ నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని గుణుపురం జీఐఈటీ విశ్వ విద్యాలయంలో నర్సింగ్‌ విభాగం హెచ్‌వోడీ కె.సి సురేష్‌బాబు అన్నారు.

Published : 05 Feb 2023 03:16 IST

ఆసుపత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహిస్తున్న  నర్సింగ్‌ విద్యార్థినులు

గుణుపురం, నూస్‌టుడే: క్యాన్సర్‌ నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని గుణుపురం జీఐఈటీ విశ్వ విద్యాలయంలో నర్సింగ్‌ విభాగం హెచ్‌వోడీ కె.సి సురేష్‌బాబు అన్నారు. ప్రపంచ క్యాన్సర్‌ డే సందర్భంగా శుక్రవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో నర్సింగ్‌ విభాగం విద్యార్థినులు చైతన్య ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌ బారిన పడకుండా పొగాకు, ధూమపానం, గుట్కాల వినియోగానికి దూరంగా ఉండాలని రోగులకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: జిల్లాలోని సామాజిక ప్రాథమిక ఆసుపత్రులతో పాటు జిల్లా ముఖ్య ఆసుపత్రి కార్యాలయంలో ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. క్యాన్సర్‌ బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పర్లాఖెముండి పట్టణంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్లకార్డులు చేతపట్టి  నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద నుంచి  పురవీధుల గుండా కొనసాగిన ర్యాలీని జిల్లా ముఖ్య వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌ నాయక్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పొగాకు, ధూమపాన, గుట్కాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుసాని సమితి బాగుసలా గ్రామంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని