logo

జయపురంలో ‘వర్చువల్‌ హైకోర్టు’ ప్రారంభం

కొరాపుట్‌ జిల్లా న్యాయవాదుల సంఘం సుదీర్ఘంగా కోరుతున్న హైకోర్టు బెంచ్‌ స్థానాన్ని ‘వర్చువల్‌ హైకోర్టు’గా సాధించింది.

Published : 06 Feb 2023 03:20 IST

వర్చువల్‌ హైకోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తి, న్యాయవాదులు

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా న్యాయవాదుల సంఘం సుదీర్ఘంగా కోరుతున్న హైకోర్టు బెంచ్‌ స్థానాన్ని ‘వర్చువల్‌ హైకోర్టు’గా సాధించింది. జయపురంలో ఉన్న జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం నాడు వర్చువల్‌ మీడియా ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వర్చువల్‌ హైకోర్టును ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యనారాయణ మిశ్ర అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవం కార్యక్రమంలో కటక్‌ హైకోర్టు జ్యుడిషీయల్‌ అకాడమీ న్యాయమూర్తి డి.మురళీధర్‌ కూడా వర్చువల్‌ మీడియాలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్టు ఆవరణలో రెండు ప్రత్యేక గదులు కేటాయించి వర్చువల్‌ హైకోర్టు కోసం ఎంపిక చేయనున్నట్టు అదనపు న్యాయమూర్తి విజ్ఞేశ్వర్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని