logo

ప్రయోగాలతో సత్ఫలితాలు

ఒకప్పుడు ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఏడాది పొడుగునా కుటుంబ సభ్యులంతా తిండిగింజలకు నోచుకోని రైతన్నలు నేడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారని మంత్రి జగన్నాథ సరకా అన్నారు.

Published : 06 Feb 2023 03:20 IST

ట్రాక్టర్‌ కొన్న రైతుకి తాళం అందిస్తున్న మంత్రి సరక, పక్కన అనసూయ, స్వాధాదేవ్‌ తదితరులు

రాయగడ, న్యూస్‌టుడే: ఒకప్పుడు ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఏడాది పొడుగునా కుటుంబ సభ్యులంతా తిండిగింజలకు నోచుకోని రైతన్నలు నేడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారని మంత్రి జగన్నాథ సరకా అన్నారు. ఆదివారం జీసీడీ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి కృషి మేళా నాలుగో రోజు సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలో రైతులు పూల సాగుచేస్తూ లక్షలాది రూపాయలు లాభాలు పొందడం అభినందనీయమని తెలిపారు. ప్రతీ రైతు ప్రయోగాత్మక విధానంలో సాగు చేసి మంచి ఫలితాలు పొందాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ స్వాధాదేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ రూ.6,45,183 విలువ చేసే వ్యవసాయ ట్రాక్టర్‌ కొనుగోలు చేసే రైతులకు రుణ సదుపాయం కల్పించడమే కాక రూ.90వేలు రాయితీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, ఆదివాసీ అభివృద్ధి మండలి అధ్యక్షురాలు అనసూయ మాఝి, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రామ చంద్ర దాస్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆదర్శ రైతులను సత్కరించారు. ట్రాక్టర్‌లు కొన్న వారికి తాళాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు