logo

కిలిమంజారో పర్వతారోహణకు పయనం

బ్రహ్మపుర గుసానినువాగాం ప్రాంతానికి చెందిన మధుస్మిత పాత్ర్‌ (29) అనే పర్వతారోహకురాలు కిలిమంజారో పర్వతాలను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 06 Feb 2023 03:20 IST

యువతికి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర గుసానినువాగాం ప్రాంతానికి చెందిన మధుస్మిత పాత్ర్‌ (29) అనే పర్వతారోహకురాలు కిలిమంజారో పర్వతాలను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 9న సాహసయాత్ర ప్రారంభించనుంది. 16న ముగించనుంది. ఈ సందర్భంగా ఆదివారం బ్రహ్మపుర ఎంపీ చంద్రశేఖర సాహు, ఎమ్మెల్యే బిక్రం కుమార్‌ పండా, బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. జాతీయ పతాకం, పర్వతారోహణకు సంబంధించిన పరికారాలను అందజేశారు. సీనియరు జర్నలిస్టు సుదీప్‌ కుమార్‌ సాహు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

మధుస్మితను సత్కరించి జాతీయ పతాకం అందజేస్తున్న ఎంపీ సాహు, ఎమ్మెల్యే పండా, మేయరు దొళాయి తదితరులు

బాల్యం నుంచే ఆసక్తి

మధుస్మిత తండ్రి ప్రేమానంద పాత్ర్‌ విశ్రాంత వాయుసేన అధికారి. ఆమె స్థానిక కళ్లికోట జూనియరు కళాశాలలో ప్లస్‌టు సైన్స్‌ చదువు పూర్తి చేసిన తర్వాత గుణుపురంలోని జీఐఈటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌లో బీ.టెక్‌ చేసింది. ప్రస్తుతం ఆమె టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది. 2019లో లద్ధాఖ్‌లోని 11,400 అడుగుల ఎత్తయిన చాదర్‌ ట్రక్‌, డార్జిలింగ్‌లోని హిమాలయ పర్వతారోహణ కేంద్రం (హెచ్‌ఎంఐ)లో బేసిక్‌ మౌంటెయినీరింగు కోర్సు చేసిన అనంతరం ఉత్తరాఖండ్‌లోని 12,500 అడుగుల కేదారకంట, సిక్కింలో 5,029 మీటర్ల ఎత్తయిన మౌంట్‌ రెనాక్‌ పర్వతాలను ఎక్కింది. ఎవరెస్ట్‌ ఎక్కడమే లక్ష్యమని మధుస్మిత తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని