logo

‘మిస్టర్‌ ఒడిశా’గా గురుప్రసాద్‌ సాహు

గంజాం బాడీబిల్డింగ్‌ ఫిట్‌నెస్‌ అసోసియేషన్‌ (జీబీబీఎఫ్‌ఎ) ఆధ్వర్యంలో 13వ ‘మిస్టర్‌ ఒడిశా-2023’ పురుషుల బాడీబిల్డింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌ పోటీలు ఆదివారం రాత్రి నిర్వహించారు.

Published : 07 Feb 2023 01:44 IST

గురుప్రసాద్‌ సాహు (మధ్యలో)కు ఇరువైపులా చందన్‌,
బెస్ట్‌ఫిజిక్‌ విజేత ప్రతీక్‌. చిత్రంలో అతిథులు, నిర్వాహకులు

  బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: గంజాం బాడీబిల్డింగ్‌ ఫిట్‌నెస్‌ అసోసియేషన్‌ (జీబీబీఎఫ్‌ఎ) ఆధ్వర్యంలో 13వ ‘మిస్టర్‌ ఒడిశా-2023’ పురుషుల బాడీబిల్డింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌ పోటీలు ఆదివారం రాత్రి నిర్వహించారు. గంజాం, పూరీ, కటక్‌, ఖుర్దా, బాలేశ్వర్‌, సంబల్‌పూర్‌, మయూర్‌భంజ్‌, ఝార్సుగుడ, సాలేపూర్‌, రాయగడ, గజపతి, కొరాపుట్‌, బొలంగీర్‌, భద్రక్‌ జిల్లాల నుంచి 132 మంది పాల్గొని తొమ్మిది కేటగిరీలలో పోటీపడ్డారు. పూరీకి చెందిన గురుప్రసాద్‌ సాహు ‘మిస్టర్‌ ఒడిశా- 2023’ టైటిల్‌ను కైవశం చేసుకున్నారు. బ్రహ్మపురకి చెందిన చందన్‌కుమార్‌ పాణిగ్రహి ద్వితీయ స్థానంలో నిలిచారు. బెస్ట్‌ ఫిజిక్‌ బహుమతిని బ్రహ్మపురకి చెందిన ప్రతీక్‌ కుమార్‌ ఛత్తర్‌ గెలుచుకున్నారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే బిక్రంకుమార్‌ పండా విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలకు నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఖుర్దా జిల్లాకు చెందిన లక్ష్మీప్రియ స్వయిన్‌ అనే మహిళా బాడీబిల్డరు అతిథిగా పాల్గొని తన శరీరసౌష్టవాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని