logo

ప్రజల వద్దకు న్యాయ సేవలు

గంజాం జిల్లా హింజిలికాటు ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరిందని, ప్రజల ముంగిట్లోకి న్యాయ సేవలు అందజేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు.

Published : 07 Feb 2023 01:44 IST

ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా జడ్జి ఆనందచంద్ర బెహరా.
చిత్రంలో కలెక్టరు పరిడా, ఎస్పీ మీనా తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా హింజిలికాటు ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరిందని, ప్రజల ముంగిట్లోకి న్యాయ సేవలు అందజేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. హింజిలికాటులో సివిల్‌ కోర్టు జడ్జి (సీనియరు డివిజన్‌, అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి) న్యాయస్థానాన్ని సోమవారం ఆయన వర్చువల్‌ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌తో కలసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడారు. కార్యక్రమంలో 5టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ కూడా పాల్గొన్నారు. హింజిలికాటులో నిర్వహించిన కార్యక్రమంలో గంజాం జిల్లా అండ్‌ సెషన్స్‌ జడ్జి ఆనంద చంద్ర బెహరా, కలెక్టరు దివ్య జ్యోతి పరిడా, గంజాం ఎస్పీ జగ్మోహన్‌ మీనా, ఇతర జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని